- Local News, News, Political

మాతో పెట్టుకోవద్దు…

రాజ్యాంగంపై చర్చకు సిద్ధమా!

నేనొక్కడిని.. మీరు 151 మంది రండి: పవన్‌ కల్యాణ్‌

ప్రజలు లేస్తున్నారు.. సీటు ఖాళీ చేయాలి

అవాకులు చవాకులు పేలితే సహించను..

గూబ వాచేలా బదులివ్వగలను

సభలకు వచ్చిన వారిలో 70% ఓటేస్తే జనసేనకు 70 సీట్లు వచ్చేవి: పవన్‌

విశాఖపట్నం: ‘నాపై అవాకులు చవాకులు పేలుతున్న వైసీపీ నాయకులారా… రాజ్యాంగంపై చర్చి ద్దాం రండి! మీరు మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు రండి. నేను ఒక్కడినే వస్తాను’ అని జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ సవాల్‌ విసిరారు. మంగళవారం విశాఖలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆయన భేటీ అయ్యారు. రెండు వేర్వేరు సమావేశాల్లో పాల్గొన్నారు. విశాఖలో లాంగ్‌ మార్చ్‌ నిర్వహించిన అనంతరం తనపై విమర్శలు గుప్పిస్తున్న మంత్రులు, వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. ‘2018లో జనసేనను చూసి వైసీపీ ఎంత భయపడిందో నాకు తెలుసు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు.. అంటే, కౌరవులున్నారు.
జనసేనకు ఒకే ఒక్కరు. అంటే ఏకవీర. ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీని చూసి అంతమంది ఎమ్మెల్యేలున్న పార్టీ భయపడుతోంది. 22 మంది పార్లమెంటు సభ్యులు ఎక్కడైనా తల ఎగరేయండి కానీ పవన్‌కల్యాణ్‌ ముందు వద్దు. 200 ఏళ్లు అడ్డూ ఆపూ లేకుండా పాలించిన బ్రిటిష్‌ వాళ్లకే దిక్కులేదు. అలాంటిది వైసీపీ ఎంత? ఆ 151 ఎమ్మెల్యేలెంత? మీరెంత… మీ బతుకెంత? నన్ను విమర్శించే వైసీపీ నాయకులకు గూబలు వాచిపోయేలా, చెవుల నుంచి రక్తం వచ్చేలా మాట్లాడగలను. కానీ… ఇలా రెచ్చిపోతే సమస్య పక్కదారి పడుతుంది. అందు కే సహనం వహిస్తాను’ అని తెలిపారు. ఒరే, తురే అన్నా… సోషల్‌ మీడియాలో నీచంగా తిట్టినా సహించాలా… అని ప్రశ్నించారు. ప్రజల పన్నులతో నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలకు తమ సొంత పేర్లు ఎలా పెట్టుకుంటారని పవన్‌ ప్రశ్నించారు. కలాం పేరు తొలగించి వైఎస్సార్‌ పేరు పెట్టడంపైనా మండిపడ్డారు. కలాం పేరు తొలగిస్తూ జీవో ఇచ్చిన అధికారిని సస్పెండ్‌ చేయాలన్నారు.
ఓటు వేయకపోయినా…
19 లక్షల మందికి పైచిలుకు భవన నిర్మాణ కార్మికులు జనసేనకు ఓటు వేయకపోవచ్చునని.. అయినా వారి సమస్యపై పోరాడుతున్నామని పవన్‌ తెలిపారు. రెండుచోట్లా ఓడిన ఓ పార్టీ అధ్యక్షుడికి అం డగా లక్షన్నర మంది వచ్చారని… అదే తన నైతికతకు నిదర్శనమని తెలిపారు. జనసేనను ‘టీమ్‌-బీ’ అనడంపై పవన్‌ మండిపడ్డారు. 2014లో ఓట్లు చీలడం ఇష్టం లేక సుస్థిర పాలన కోసం బీజేపీ, టీడీపీతో కలిసి పని చేశానని చెప్పారు. దొంగచాటుగా టీడీపీతో కలిసి పనిచేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విశాఖలో ఒక్క సభ పెడితే తమ నాయకులపై ఎన్నో కేసులు పెట్టారని, వాటిని ఉపసంహరించుకోకుంటే చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. ‘నేను సినిమాలు చేస్తే వంద కోట్లు సంపాదించగలను.
అదే వంద కోట్లు సీఎం జగన్‌ గానీ, ఆయన మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ సంపాదించాలంటే… వెయ్యి కోట్ల విలువైన అక్రమాల ఫైలుపై సంతకం చేయాల్సి ఉంటుంది’ అని పవన్‌ అన్నారు. అధికారంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు వ్యాపారాలున్నాయని, వాటిలో అక్రమాలూ ఉన్నాయని, వాటిని బయటకు తీసి నిర్భయంగా మాట్లాడాలని కార్యకర్తలకు సూచించారు. సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే ‘తమ్ముడు’ సినిమా నుంచి ప్రకటనలు చేయడం మానుకున్నానని పవన్‌ తెలిపారు. ‘ఒక శీతల పానీయం ప్రకటన చేసినందుకు జాతీయస్థాయిలో ఇచ్చినదానికంటే రూ.40 లక్షలు ఎక్కువ ఇచ్చారు. కానీ, ఆ పానీయం తాగితే మంచిది కాదని తెలిసి ఇకపై అలాంటి ప్రకటనలు చేయకూడదని నిర్ణయించుకున్నాను’ అని పవన్‌ తెలిపారు.
మాటకు మాట…
పులివెందులలో రాజధాని… కర్నూలులో కోర్టు
కొద్దిరోజుల కిందట రాయలసీమ నుంచి న్యాయవాదులు వచ్చి కర్నూలులో హైకోర్టు పెట్టాలని అడిగారు. సీఎంనే అడగాలని చెప్పాను. రాజధానిని జగన్‌ పులివెందులకు మార్చుకుంటే… కర్నూలులో కోర్టుకు వెళ్లి రావడానికి వీలుగా ఉంటుంది. అలా చేయడమే బెటర్‌!
బొత్సకు చాన్స్‌ ఇస్తే..
అవకాశం వస్తే మంత్రి బొత్స చీపురుపల్లిని రాజధానిగా చేసుకుంటారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదని చాలామంది అంటున్నారు. కానీ.. ఇక్కడున్న మంత్రు లు, పక్క జిల్లాల నుంచి వచ్చిన అవంతి శ్రీనివాసరావు బాగుపడ లేదా!
అవంతిపై…
అవంతి శ్రీనివా్‌సను భయపెట్టేందుకు పావుగంటకొకరు చొప్పున వందమంది ఆయన ఇంటి చుట్టూ తిరిగితే చాలు.
అంబటిపై…
అంబటి రాంబాబు 30 రోజుల్లో ఫ్యాక్షనిజం చేయడమెలా! అదుపు తప్పి మా ట్లాడటం ఎలా అన్నది నేర్చుకున్నట్లుంది…

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *