- Local News, News, Political

వైసీపీ నై… ఎంపీ జై !

మాతృభాషలో బోధనకు రఘురామరాజు మద్దతు

లోక్‌సభలో ‘తెలుగు’ ప్రశ్న

న్యూఢిల్లీ,మాతృభాషలో విద్యాబోధనకు ప్రాధాన్యతనీయాలని వైసీపీ ఎంపీ రఘురామరాజు అన్నారు. ఒక వైపు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ.. రాష్ట్రంలో తెలుగుభాషలో విద్యాబోధనను రద్దు చేస్తామని ప్రకటించగా, అదే పార్టీకి చెందిన ఎంపీ మాత్రం తద్భిన్నమైన వాదనను లోక్‌సభలో సోమవారం లేవనెత్తడం గమనార్హం. ‘‘ మాతృభాషా పరిరక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని 350, 350ఎ అధికరణాల స్ఫూర్తి దెబ్బతినకుండా కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని రఘురామరాజు కోరారు. ఆయన ప్రస్తావించిన ఈ అధికరణాల్లో 350.. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధనకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి ప్రస్తావిస్తుంది.
350 ఏ అనేది ఎవరైనా ప్రాంతీయ భాషలో తమ సమస్యలను చెప్పుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నది. కాగా, ప్రాచీన భాషా కేంద్రం గురించి తెలుగుదేశం సభ్యుడు కేశినేని నాని అడిగిన ప్రశ్నకు రఘురామ రాజు అనుబంధ ప్రశ్న వేశారు. తెలుగు అకాడమీని విభజించేందుకు కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ‘‘తెలుగు అకాడమీకి చెందిన వందల కోట్ల నిధులు హైదరాబాద్‌ లోనే ఉండిపోయాయి. విభజన చట్టంలోని 10 వ షెడ్యూలులో అకాడమీ ఉన్నది. ఈ చట్టం ప్రకారం అకాడమీకి చెందిన నిధులను 58:42 నిష్పత్తిలో విభజించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు’’ అని ఆయన ప్రశ్నించారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *