- Local News, News, Political

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి పోలీస్ స్టేషన్ కు బేడీలు

షాద్‌నగర్: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి పోలీస్ స్టేషన్‌కు బేడీలు వేసిన ఘటన షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితులు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉండటంతో.. మహిళా సంఘాలు, విద్యార్థినులు, ప్రజా సంఘాలు స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఆందోళనలు తారస్థాయికి చేరడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. అయితే ఆందోళనకారులు స్టేషన్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టేషన్‌ గేటుకు వేయడానికి తాళాలు లేకపోవడంతో… బేడీలను వేశారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *