- Local News, News

పెట్రోల్ కోసం రెండు బంకులకు

కొత్తూర్‌: శంషాబాద్ ఘటనలో వైద్యురాలిని దారుణంగా హత్య చేసిన నిందితులు పెట్రోల్‌ కొనుగోలుకు రెండు బంకులను ఆశ్రయించారు. ఒక బంక్‌ సిబ్బంది నిరాకరించగా, మరో పెట్రోల్‌ బంక్‌ నుంచి కొనుగోలు చేశారు. 12.57 గంటలకు కొత్తూర్‌, నందిగామ మండలాల సరిహద్దులో బైపాస్‌ రహదారి పక్కన ఉన్న మహాలక్ష్మి ఎస్సార్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌కు వచ్చారు. ఓ నిందితుడు ఫిల్లింగ్‌ స్టేషన్‌ ముందు ఉన్న చెట్ల పొదల మాటున బాధితురాలి వాహనంతో ఆగాడు. మరో నిందితుడిని పెట్రోల్‌ కోసం పంపించాడు. ‘‘దూర ప్రాంతం నుంచి వస్తున్నాం.. త్వరగా పెట్రోల్‌ కావాలి’’ అని అతడు అడిగాడు. బంక్‌ సిబ్బందికి అనుమానం వచ్చి నిందితుడిని ప్రశ్నించగా, పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దాంతో, పెట్రోల్‌ పోయడానికి నిరాకరించారు. కానీ, పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. 1.10 గంటలకు వారు నందిగామ మండల పరిధిలోని బండకుంటతండా సమీపంలో ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ రూ.150 పెట్రోల్‌ కొనుగోలు చేసి అక్కడికి కొద్ది దూరంలోనే హత్య చేసిన స్థలానికి చేరుకున్నారు.
మహాలక్ష్మి ఎస్సార్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ సిబ్బందికి వచ్చిన అనుమానం ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ వాళ్లకు కూడా వచ్చుంటే బాధితురాలు కనీసం ప్రాణాలతోనైనా ఉండేదనే అభిప్రాయం వినిపిస్తోంది.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *