- Local News, News

వైద్యరాలి ఘటన చాలా బాధగా ఉంది… సినీనటుడు అలీ

హైదరాబాద్: వైద్యురాలి తల్లిదండ్రులను చూస్తుంటే గుండె కరిగిపోతోందని సినీనటుడు అలీ అన్నారు. వైద్యురాలి కుటుంబ సభ్యులను అలీ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైద్యురాలికి జరిగిందే నిందితులకూ జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారని చెప్పారు. వైద్యురాలు తన కూతురు లాంటిందన్నారు. కనీసం తల్లిదండ్రులకు శవం కూడా లేకుండా చేయడం దారుణమన్నారు. శవమైనా దొరికుంటే ఇంత బాధపడేవారు కాదేమో? అని అభిప్రాయపడ్డారు. వైద్యురాలి తల్లిదండ్రులు ఏడుస్తుంటే.. చాలా బాధగా ఉందన్నారు. న్యాయవాదులెవరూ కూడా ఈ కేసు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు వాదించకూడదని బార్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు. వైద్యురాలి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *