- Local News, News, Political

ఏపీలో పేదలు,సమాన్య ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు… చంద్రబాబు

అమరావతి: గ్రామ కమిటీల ఏర్పాటుపై టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం మెండుగా ఉందన్నారు. కార్యకర్తల్లో పట్టుదల పెరిగిందని.. వాళ్ల ఉత్సాహమే పార్టీకి ఎనలేని బలం అన్నారు. పార్టీ పటిష్టతపైనే అందరూ దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో 6 నెలల్లో అన్నీ వైఫల్యాలేనని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలు, సామాన్య ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారన్నారు. ఆరు నెలల్లోనే జనాన్ని ఇన్ని కష్టాలు పెట్టడం ఎప్పుడూ చూడలేదన్నారు. వైసీపీ చేతగానితనంతో రాష్ట్రానికి ఎనలేని కీడు చేశారన్నారు.
రైతులు, యువత, మహిళల ఆశలను నీరుగార్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇన్ని ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు గతంలో లేవన్నారు. ఇసుక కొరతతో 60మంది ఆత్మహత్యలు దేశంలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని.. మద్యం ధరలను 150%-200% పెంచారన్నారు. దళారుల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారన్నారు. పెట్టుబడులన్నీ రాష్ట్రం నుంచి వెనక్కి పోయాయన్నారు. ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని నెట్టారని.. అధికార పార్టీ అరాచకాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. వీటన్నింటిపై గ్రామాల్లో, వార్డులలో చర్చలు చేయాలన్నారు. పంచాయితీ ఎన్నికల్లోపు పార్టీ కమిటీలన్నీ ఏర్పడాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *