- Local News, National International, News, Political

ఇళ్ల కొనుగోలుకు సర్కారీ వెబ్ సైట్

నేషనల్‌ రియల్‌ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు

దిల్లీ: దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఇళ్ల విక్రయం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ రియల్‌ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నరేడ్కో) మంగళవారం  https://www.housingforall.com/ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్‌ మిశ్ర దీన్ని ప్రారంభించారు. రెరా కింద నమోదైన నమ్మకమైన, భద్రమైన, నాణ్యమైన ఇళ్లను మాత్రమే ఈ వెబ్‌సైట్‌ ద్వారా విక్రయించనున్నట్లు ఆయన ప్రకటించారు. పూర్తిగా సిద్ధమైన ఇళ్లను వర్చువల్‌ రియాల్టీ ద్వారా పరీక్షించుకుని ఎంపికచేసుకోవచ్చని చెప్పారు. ఇందులో దాదాపు వెయ్యి ప్రాజెక్టులను లిస్ట్‌ చేయనున్నట్లు నరేడ్కో ప్రకటించింది. ఈ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవడానికి స్థిరాస్తి వ్యాపారులకు ఫిబ్రవరి 13 వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 14 నుంచి వినియోగదారులకు పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. మార్చి 1 నుంచి విక్రయాలు మొదలవుతాయి.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *