- Local News, News, Political

నిధులు లేక దీనావస్థలో వినియోగదారుల ఫోరంలు

కనీస బడ్జెట్‌ లేక ఇబ్బంది పడుతున్న సిబ్బంది

కాగితాల కొరతతో కేసుల ఫైలింగ్‌, డ్రాఫ్టింగ్‌కు అవస్థలు

మూడు నెలలకోసారి రూ. 8 వేలు విడుదల

పెరుగుతున్న కేసులు.. సరిపోని స్టేషనరీ

హైదరాబాద్‌: జిల్లాలోని వినియోగదారుల ఫోరం కోర్టులు దీనావస్థలో కొనసాగుతున్నాయి. వివిధ రకాల వస్తువుల కొనుగోళ్లలో, రవాణా సౌకర్యాల్లో, ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతో జరిగిన సేవల లోపాలపై దళారులు, అక్రమార్కు ల చేతుల్లో తీవ్రంగా నష్టపోతున్న వారిని ఆదరించి తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తున్న జిల్లా వినియోగదారుల ఫోరంలు సమస్యల వలయంలో చిక్కుకుపోతున్నాయి. ఆయా కార్యాలయాల్లో కనీస సౌకర్యాలు కరువవడంతో అధికారులు, సిబ్బంది నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రంగాల్లో మోసపోతున్న బాధితుల పక్షాన నిలబడి పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలతో సహవాసం చేస్తున్నారు.
జిల్లాలో మూడు…
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత వినియోగదారుల ఫోరంలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న బాధితులకు సకాలంలో న్యాయం చేయాలనే ఉద్దేశంతో కొన్నేళ్ల క్రితం జిల్లా పరిధిలో మూడు వినియోగదారుల ఫోరంలు ఏర్పాటు చేశారు. వీటిని నాంపల్లిలోని చంద్రవిహార్‌ కాంప్లెక్స్‌లో హైదరాబాద్‌ 1,2,3 ఫోరంలుగా విభజించి ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్‌లో రాష్ట్ర విని యోగదారుల ఫోరం ప్రత్యేకంగా ఏర్పాటైంది. రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు, హైదరాబాద్‌ మూడు ఫోరంలలో రూ. వెయ్యి నుంచి రూ. 25 లక్షల వరకు కేసులకు సంబంధించి ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది.
స్టేషనరీ కొరతతో ఇబ్బందులు
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వినియోగదారుల ఫోరంల కంటే నగరంలోని 3 ఫోరంలు, రంగారెడ్డి కోర్టులో ప్రతిరోజూ 40 నుంచి 50 వరకు మంది తాము మోసపోయామంటూ ఫిర్యాదు చేస్తుంటారు. రాష్ట్ర వినియోగదారుల ఫోరంకి 10 నుంచి 15 ఫిర్యాదులు వస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఆయా ఫోరంలలో కనీస సౌకర్యాలతోపాటు స్టేషనరీ సమస్య సిబ్బందిని తీవ్రంగా వేధిస్తోంది.
ఒక్కో ఫోరానికి మూడు నెలలకోసారి రూ. 8వేల చొప్పున బడ్జెట్‌ విడుదల చేస్తుండడంతో సరిపడా సామగ్రి కొనుగోలుచేసే పరిస్థితి ఉండడం లేదు. ఆ డబ్బుతో కాగితాలు, పెన్నులు, ప్యాడ్లు, యాసిడ్‌ బాటిళ్లు కొనుగోలు చేస్తుండడంతో సరిపోవడం లేదని, ఫిర్యాదుల నమోదు, డ్రాఫ్టింట్‌, తీర్పులను వెల్లడిస్తున్న సమయంలో కాగితాలు సరిపోవడంలేని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు ఒకవైపు వినియోగించిన పేపర్లనే వాడుకుంటున్నామని చెబుతున్నారు.
పట్టించుకోని ప్రభుత్వం
ఫోరంల నిర్వహణ భారాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సిబ్బంది అవస్థలు పడుతున్నారు. స్టేషనరీ బడ్జెట్‌ను పెంచడంతోపాటు దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని న్యాయాదులు, కోరుతున్నారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *