- Local News, News, Political

స్వస్థలానికి మండలి చైర్మన్ షరీఫ్ వెళ్లగానే…

నరసాపురం: శాసనమండలి చైర్మన్‌ షరీఫ్ ఆయన స్వస్థలం నరసాపురానికి వెళ్లారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. షరీఫ్‌ను జేఏసీ నేతలు అభినందించారు. పరిపాలన వికేంద్రీకరణ – సమగ్రాభివృద్ధి బిల్లుతోపాటు సీఆర్డీయే రద్దు బిల్లును మండలి చైర్మన్‌ షరీఫ్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి రైతులకు అండగా, న్యాయంగా నిర్ణయం తీసుకున్నారని ఆయనను రాజధాని రైతులు కొనియాడుతున్నారు. రూల్‌ 154 ప్రకారం తనకు లభించిన విచక్షణాధికారం మేరకు మండలి చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడలో మండలి చైర్మన్‌ షరీఫ్‌ చిత్రపటానికి ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. అనంతపురం జిల్లా మడకశిరలో మూడు రాజధానుల బిల్లుపై శాసన మండలిలో కమిటీని ఏర్పాటు చేసినందుకు అమరావతి పరిరక్షణ కమీటీ ఆధ్వర్యంలో షరీఫ్ చిత్రపటానికి, అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం జరిగింది. శాసన మండలిలో రాజధాని వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ బిల్లుకు బ్రేక్ పడినందుకు హర్షం వ్యక్తం చేస్తూ తణుకు మాజీ శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మండలి చైర్మన్ షరీఫ్ ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది…

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *