- Local News, News, Political

హైకోర్టులో ఏపీ డీజీపీ…పోలీసుల తీరుపై ఆక్షేపణ

అమరావతి: ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హైకోర్టులో హాజరయ్యారు. తమను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ ఇద్దరు యువకులు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు

జరిగాయి. అదృశ్యమైన వ్యక్తిని కోర్టులో హాజరు పరిచినంతమాత్రాన..

కేసును మూసివేసినట్లు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. వ్యక్తి అదృశ్యానికి గల కారణాలను తెలపాలని న్యాయమూర్తి అడిగారు. అలాగే నోటీసులు లేకుండా న్యాయవాది ఇంట్లో తనిఖీలు చేయడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్లపై విచారణ జరిపి మెరిట్‌ ఆధారంగానే కేసుపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *