- Local News, News, Political

మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్… రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ

అమరావతి: సీఎం జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం ఢిల్లీ వెళ్తారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అవుతారు. రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి జగన్ ఢిల్లీ వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఢిల్లీ పర్యటనలో రాజధాని, విభజన చట్టం, అభివృద్ధి నిధులపై చర్చించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. బుధవారం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి వచ్చారు. శుక్రవారం ప్రత్యేకంగా అమిత్‌షాను మాత్రమే కలుస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఉభయుల చర్చల్లో శాసనమండలి రద్దు, పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటే ప్రధాన ఎజెండా అని చెబుతున్నారు. కాగా.. ప్రధానిని కలిసినప్పుడు కూడా ఆయన ఈ రెండింటినీ ప్రస్తావించారు. ప్రత్యేక హోదా, పోలవరం, ఇతర సాయాల కోసం 11 అంశాలతో విజ్ఞాపన పత్రాన్ని సమర్పించిన సంగతి తెలిసిందే. వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం.. మండలిని తక్షణమే ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో మోదీకి సీఎం వివరించారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *