- Local News, News, Political

పరీక్షలు లేకుండానే పైతరగతులకు

6 నుంచి 9 వరకూ వార్షిక పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం

అమరావతి: కరోనా కారణంగా పాఠశాలలన్నీ మూసేసిన నేపథ్యంలో 6 నుంచి 9 తరగతుల వరకూ చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలు లేకపోయినా నేరుగా పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం సీఎం జగన్‌ విద్యాశాఖపై సమీక్షించారు. కరోనా వైరస్‌ వల్ల ఇతర రాష్ర్టాల్లో పరీక్షలు రాయకుండానే 6 నుంచి 9 తరగతుల పిల్లలను పైతరగతులకు పంపుతున్నారనే విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో రాష్ట్రంలోనూ అదే విధానం అమలుచేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *