- Local News, National International, News, Political

కరోనా ఎఫెక్ట్ తో ఆర్ బీఐ,కీలక ప్రకటన

ముంబై: దేశంలో కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. రెపోరేటును 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. రివర్స్‌ రెపోరేటును కూడా ఆర్‌బీఐ తగ్గించింది. దీంతో రివర్స్‌ రెపోరేటు 90 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మీడియాతో మాట్లాడుతూ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు. రివర్స్‌ రెపోరేటు నాలుగు శాతానికి చేరిందన్నారు. రుణాల రేటు 4.4 శాతానికి చేరిందని.. ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామని గవర్నర్‌ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్ని ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఆర్థిక స్థిరత్వం కోసం చర్యలు తీసుకుంటామని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వ్యాఖ్యానించారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *