Jai surya news భూమి విలువ పెంపుపై చర్యలు తీసుకోండి - Jaisurya News

భూమి విలువ పెంపుపై చర్యలు తీసుకోండి

న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ ఫిర్యాదుపై తెలుగు రాష్ట్రాలకు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ : భూమి విలువను పెంచేలా తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. భూమి విలువ తక్కువగా ఉండడంతో భూసేకరణ సమయంలో రైతులు, భూ యాజమానులు నష్టపోతున్నారంటూ న్యాయవాది కె.శ్రావణ్‌కుమార్‌ చేసిన ఫిర్యాదుపై కేంద్ర సర్కారు స్పందించింది. ఈ మేరకు కేంద్ర భూవనరుల విభాగం సెక్రటరీ జీకే ధకాటే ఇరు రాష్ట్రాల రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శులకు లేఖ రాశారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *