Jai surya news స్వరూపానందేంద్ర జన్మదినంపై ప్రత్యేక ఆదేశాలు - Jaisurya News

స్వరూపానందేంద్ర జన్మదినంపై ప్రత్యేక ఆదేశాలు

అమరావతి: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదిన వేడుకల్ని జరపాలంటూ పలు దేవాలయాలకు ఏపీ దేవాదాయశాఖ మెమో జారీ చేసింది. ఈనెల 18న ఆయన జన్మదినం సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యదేవాలయం, ద్వారకా తిరుమల, రామతీర్థం, సింహాచలం, కనక మహాలక్ష్మి, అన్నవరం, అంతర్వేది, మావుళ్లమ్మ దేవస్థానం ఈవోలకు ఆయన మెమో పంపారు. ఈనెల 9న విశాఖ శారదాపీఠం మేనేజర్‌ లేఖ రాసిన నేపథ్యంలో దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆయా దేవాలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *