Jai surya news 23 నుంచి ఏయూ దూరవిద్య పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుల పరీక్షలు - Jaisurya News

23 నుంచి ఏయూ దూరవిద్య పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుల పరీక్షలు

ఏయూ (విశాఖపట్నం : ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్య పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుల పరీక్షలు ఈ నెల 23 నుంచి నిర్వహిస్తున్నట్టు ఏయూ స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పి.హరిప్రకాశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలను రోజూ మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 25 కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. కాగా ఏయూ క్యాంప్‌సలోని పరీక్ష కేంద్రాలను మార్పు చేశామన్నారు. విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను తమకు కేటాయించిన కేంద్రాల్లో పొందాలని, మరిన్ని వివరాల కోసం 7702257813, 0891-2844164 ఫోన్‌ నంబర్లను లేదా www.andhrauniversity.edu.in వెబ్‌సైట్‌ను సంప్రతించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *