Jai surya news నిబంధనల అతిక్రమణలపై కన్నెర్ర - Jaisurya News

నిబంధనల అతిక్రమణలపై కన్నెర్ర

బీచ్‌ రోడ్డులోని ఓ స్థలంలో తొలగించిన ప్లాస్టిక్‌ షీట్లు

విశాఖ,సాగర్‌నగర్‌ : నగర పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపు పరంపర వేగమందుకుంది. గత కొన్ని రోజులుగా గుర్తించిన నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. శనివారం భీమిలి బీచ్‌ రోడ్డులో వివిధ వినోద క్రీడలు నిర్వహించే ‘గోకార్టింగ్‌’ కేంద్రంలో కొన్ని నిర్మాణలను నేలమట్టం చేశారు. ఇక్కడ కొంత భూమిలో అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారని అధికారులు పేర్కొంటన్నారు. మరో వైపు జోన్‌-1లో సోమయాజులు అనే వ్యక్తి తీర ప్రాంత పరిధి నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన గోడను జీవీఎంసీ సిబ్బంది తొలగించారు. విశాలాక్షినగర్‌లో సృజన, బీచ్‌రోడ్‌ ఐటి కూడలిలో గోకరాజు గంగరాజు ఏర్పాటు చేసిన గోడ, ప్లాస్టిక్‌ షీట్లను తొలగించారు. ఎంవీపీ కాలనీలో రెండో అంతస్తు, ఎంవీపీ సెక్టార్‌ 2లో రెండు ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించారు. మర్రిపాలెంలో 3వ అంతస్తు, జోన్‌-4లో రెండో అంతస్తు పిల్లర్లు, జోన్‌-5 శ్రీనగర్‌లో ఓ ఇంటిని తొలగించారు. నగరపాలెంలోని కాశీ ఎంటర్‌ప్రైజస్‌ రిసార్ట్స్‌ నిర్మించిన షెడ్డును, కాపులుప్పాడలో సుబ్బరాజు ప్రహరీని తొలగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *