Jai surya news రాయితీలతో అండ - Jaisurya News

రాయితీలతో అండ

రాయితీలతో అండ
మత్స్యకార మహిళకు రుణ అనుమతి పత్రాన్ని అందజేస్తున్న మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు,

కన్నబాబు, ఎమ్మెల్యే వాసుపల్లి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌

విశాఖ : ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్సు కూడలిలో ఏర్పాటు చేసిన ఫిష్‌ కియోస్క్‌, ఫిష్‌ కార్టులను రాష్ట్ర మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, జేసీ వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ప్రారంభించారు. లబ్ధిదారులకు రుణమంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీసీలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మత్స్యశాఖ జేడీ ఫణిప్రకాష్‌, డీడీ పి.లక్ష్మణరావు, ఆర్డీఓ పెంచలకిషోర్‌ పాల్గొన్నారు.

ఫిష్‌ కియోస్క్‌కు రూ.10 లక్షలు, త్రిచక్ర వాహనానికి రూ.3లక్షల చొప్పున రుణం మంజూరు చేశారు. పీఎంఎంఎస్‌ పథకంలో మధురవాడకు చెందిన మహిళకు ఫిష్‌ కియోస్క్‌ను మంజూరు చేశారు. యూనిట్‌ విలువ రూ.10లక్షల్లో 60శాతం రాయితీగా, మిగిలిన 40శాతం లబ్ధిదారుని వాటాగా పేర్కొన్నారు. కియోస్క్‌ ద్వారా బతికి ఉన్న చేపలను విక్రయించే అవకాశం ఉంది. రూ.3లక్షల విలువ చేసే ఈ-ఫిష్‌ కార్ట్‌ను అప్పుఘర్‌కు చెందిన మత్స్యకార మహిళకు కేటాయించారు. బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనంలో చేపలు పాడవకుండా శీతలీకరణ సదుపాయాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *