‘లాల్చద్దా’ షూటింగ్లో ఆమిర్‌కు గాయం

బాలీవుడ్ స్టార్స్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకుడు. హాలీవుడ్ క్లాసిక్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కు ఇది హిందీ రీమేక్. ఈ సినిమాలో టామ్ హ్యాంక్స్ పోషించిన పాత్రలో ఆమిర్ ఖాన్ నటిస్తున్నారు. లాక్డౌన్ ముందే చాలా వరకు చిత్రీకరణను జరుపుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మిగిలిన భాగాన్ని పూర్చి చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఆమిర్ ఖాన్ గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని యాక్షన్ సన్నివేశాలు చేస్తున్న క్రమంలో అతని పక్కటెముకకు గాయమయినట్లు తెలుస్తోంది. అయితే షూట్‌కు ఎలాంటి ఆలస్యం కాకుదని భావించిన ఆమిర్ పెయిన్ కిల్లర్ తీసుకొని షూటింగ్ కొనసాగించినట్లు సమాచారం