అనుష్క, విరాట్ ఫోటో వైరల్

ఇటు సినిమా.. ఇటు క్రికెట్ ప్రపచంలో అనుష్క-విరాట్ జంటకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూనే సమయం చిక్కినప్పుడల్లా ఇద్దరి కలిసి సరాదాగా గడుపుతుంటారు. ప్రస్తుతం అనుష్క శర్మ గర్భవతి అన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో అనుష్క పండండి బిడ్డకు జన్మనివ్వనుంది. మొదటిసారి తల్లిదండ్రులు కాబోతుండటంతో ఆ ఆనందంలో ఉండే అనుభూతిని విరుష్క జంట ఆస్వాదిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ 2020లో భాగంగా విరాట్ కోహ్లీ దుబాయ్లో ఉండగా ఆయన సతీమణి అనుష్క కూడా అక్కడే ఉన్నారు