- E-Paper, Entertainment, Local News, News, Political

కొనసాగుతున్న పోలింగ్ ,ఓటేవేసిన ప్రముఖులు

కొనసాగుతున్న పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

హైదరాబాద్‌: సార్వత్రిక సమరంలో భాగంగా ప్రారంభమైన రెండో విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్‌ ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఉదయాన్నే ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు తరలివచ్చారు. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ చెన్నై సెంట్రల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
 సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌, ఆయన కుమార్తె శ్రుతి హాసన్‌ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నైలోని ఆల్వార్‌పేటలో క్యూలో నిలుచుని ఓటేశారు.
 తమిళ సినీ నటులు అజిత్‌, ఆయన భార్య షాలిని, మరో సినీ నటుడు విజయ్‌ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
 తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సేలంలోని ఎడప్పాడిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 పుదుచ్ఛేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ ఓటు వేశారు.
 సినీ నటుడు, బెంగళూరు సెంట్రల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌ రాజ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బెంగళూరు సౌత్‌ నియోజకవర్గంలో ఓటేశారు.
 కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కూడా ఓటేశారు. ఆయన తనయుడు కార్తీ చిదంబరం కూడా సతీమణితో కలిసి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన శివగంగ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
 మహారాష్ట్రలో సోలాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత సుశీల్‌ కుమార్‌ షిండే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *