- E-Paper, Local News, News, Sports

జాతీయస్థాయి పుట్ బాల్ పోటీలకు ఏపీ జట్టు

శ్రీజైసూర్యన్యూస్:-   విశాఖ క్రీడలు, జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు రాష్ట్ర బాలికల జట్టు ఎంపికైనట్లు ఏపీ ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు కొసరాజు గోపాలకృష్ణ తెలిపారు. పోటీలు ఈనెల 20 నుంచి 30 వరకు మహారాష్ట్రలో జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించిన బాలికల శిక్షణ శిబిరం డాక్టర్‌ లంకపల్లి బుల్లయ్య కళాశాల మైదానంలో గురువారం ముగిసిందిన్నారు. కార్యక్రమంలో జిల్లా సంఘం కార్యదర్శి ఎ.జగన్నాధరావు తదితరులు పాల్గొన్నారు.

ఎంపికైంది వీరే.. : సిహెచ్‌.హారిక, ఎల్‌.మణి (శ్రీకాకుళం), పి.గాయత్రి, బి.బబ్లీ (విజయనగరం), ఫియాన్లీ, తనిష్క (విశాఖపట్నం), జి.భవానీ, ఎల్‌.అశ్వినీప్రియ (పశ్చిమగోదావరి), డి.మౌనిక, వి.శృతి, జి.రేష్మ (కృష్ణా), డి.నిరీక్షణ, డి.మౌనిక (కడప), వై.అనిత, ఎం.రాజేశ్వరి, సి.లావణ్య, పి.లీలావతి, యు.లక్ష్మీదేవి, యు.గౌతమి, కె.శృతి (అనంతపురం), కోచ్‌గా పి.ఆర్‌.రాజేష్, జట్టు మేనేజరుగా ఎ.అశ్విని వ్యవహరించనున్నారు.


బాలికల క్రికెట్‌ శిక్షణకు పేర్ల నమోదు

విశాఖ క్రీడలు, బాలికల క్రికెట్‌ శిక్షణ శిబిరానికి పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా క్రికెట్‌ సంఘం ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి తెలిపారు. మున్సిపల్‌ స్టేడియంలో ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకూ, ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వద్ద సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల మధ్య పేర్లను ఈనెల 27వ తేదీలోగా క్రీడాకారిణులు నమోదు చేసుకోవచ్చన్నారు. వచ్చే నెల 3 నుంచి 31 వరకు శిక్షణ శిబిరం ఏసీఏ- వీడీసీఏ స్టేడియం-బి మైదానంలో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *