గ్రేటర్‌లో ఓటేసొస్తాం… సెలవు ఇవ్వండి

ప్రభుత్వానికి ఉద్యోగుల వినతి

అమరావతి : డిసెంబరు 1న జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ మంజూరు చేయాలని అమరావతి సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల్లో పని చేస్తున్న పలువురు ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు ఉద్యోగుల తరఫున సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీకి వినతిపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *