న్యాయమా.. అందుమా!!  

 ప్రీ లిటిగేషన్‌ కౌన్సెలింగ్‌ ఫోరానికి విశేష స్పందన

● వరుస కడుతున్న బాధితులు

కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న ఫోరం సభ్యులు(దాచిన చిత్రం)

విశాఖ : భూసంబంధిత వివాదాలే ఎక్కువ: ఇక్కడికి భూ సంబంధిత వివాదాలే ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలాంటివి 101 వచ్చాయి. కుటుంబ పరంగా వచ్చే ఆస్తి మరొకరి పేరిట రిజిస్ట్రేషన్‌ జరిగిందని, తమ భూమిలోంచి రహదారులు వేసి నష్టపరిహారం ఇవ్వలేదని, తమ భూమి ఇతరుల వినియోగంలో ఉందని, తమ భూమికి ఇతరుల పేరిట పట్టాలు వచ్చాయని, తమ పరిధిలోని భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని పలువురు వస్తున్నారు.
● రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత తహసీల్దార్‌కు లేఖ రాసి, భూ వ్యవహారం 10 నుంచి 15 రోజుల్లో మరోసారి సర్వే చేసి, నివేదిక సమర్పించాలని ఫోరం సభ్యులు ఆదేశిస్తున్నారు. అప్పటి వరకు కేసును వాయిదా వేస్తున్నారు. ఆస్తుల పంపకంలో న్యాయస్థానంలో ఉన్న వాటికి సంబంధించి ఇరుపార్టీలు అంగీకారంతో వస్తేనే ఫోరం వారికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోంది.

మున్సిపల్‌ కార్యాలయ పరిధిలో: ఫోరం వద్దకు మున్సిపల్‌ శాఖకు సంబంధించిన తగాదాలు కూడా వస్తున్నాయి. వీటిలో అత్యధికంగా అద్దెకు తీసుకున్న దుకాణాల్లో ఇతర కార్యకలాపాలు చేపడుతున్నారని, ప్లాన్‌కు విరుద్దంగా నిర్మాణం చేపట్టారని తద్వారా తమకు ఇబ్బందులు వస్తున్నాయని, ఇళ్లు ఖాళీ చేయకుండా తాళం వేసి ఉంచటం, ప్లాన్‌ లేకుండా నిర్మాణాల వల్ల పరిసరాల్లోని వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయనే అంశాలపై ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని జీవీఎంసీకి చెందిన పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన ఉద్యోగి పర్యవేక్షిస్తున్నారు.

కొంత సమయం పట్టినా: ప్రస్తుతం ఫోరం ముందుకు వచ్చిన అన్ని అంశాలను సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కౌన్సెలింగ్‌ను చేపడుతున్నారు. కొన్ని వాయిదాలు వేసి కొంత సమయం ఇస్తున్నారు. దీంతో ఫోరం ముందుకు వచ్చిన వినతులు మరో రెండు, మూడు నెలల్లో పూర్తి స్ధాయిలో పరిష్కారం పొందేందుకు ఆస్కారం ఉంటుందని కమిటి సభ్యులు చెబుతున్నారు. ఇరువర్గాలు అంగీకారం లేకపోతే పరిష్కారానికి సమయం పడుతుందని పేర్కొన్నారు.

పోలీసు స్టేషన్ల వారీగా: ప్రీలిటిగేషన్‌ ఫోరంలో పోలీసు స్టేషన్‌కు వెళ్లిన వారి దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తున్నారు. అందువల్ల బాధితులు ముందుగా స్టేషన్‌లో సంప్రదించిన తర్వాతనే ఆయా స్టేషన్‌ నుంచి ఇచ్చిన ధ్రువపత్రాలతో హాజరుకావాల్సి ఉంది. గత నెల రోజులుగా కమిషనరేట్‌ పరిధిలోని పోలీసు స్టేషన్ల నుంచి వచ్చిన వినతులు ఇలా ఉన్నాయి.

సమ్మతిస్తే: సివిల్‌ తగాదాల పిటీషన్లకు సత్వర పరిష్కార మార్గం చూపేందుకు నెలకొల్పిన ఈ ‘ఫోరం’ ముందుకు వచ్చిన వారికి తగిన, సూచనలు సలహాలు ఇస్తారు. ఇరు వర్గాలు సమ్మతిస్తే, రాజీ కుదిరితే… లోక్‌అదాలత్‌/లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎదుట ఫిర్యాదుదారులను హాజరుపరిచి, న్యాయవ్యవస్ధ ఆమోదించిన న్యాయపరమైన అప్పీలులేని ముగింపును చట్టం ద్వారా ఇవ్వటానికి చొరవ తీసుకుంటున్నారు.

3 విభాగాలుగా: ఫోరం ముందుకు వచ్చే వినతులను చరాస్తి, స్ధిరాస్తి, ఇతర అంశాల పేరిట మూడు విభాగాలుగా వర్గీకరించారు. ఆస్తి, భూములు తదతర వాటిని స్ధిరాస్తిగాను, నగదు సంబంధిత లావాదేవీలు, రుణాలు, చిట్స్‌ వివాదాలు వంటివి చరాస్తిగాను, కుటుంబ వివాదాలు, ఇరుగు పొరుగువారితో, ఇతర వ్యక్తులతో ఉన్న వివాదాలను ఇతర విభాగంగా పరిశీలిస్తున్నారు.

వివాదాలకు ఎక్కడో ఒక చోట పరిష్కారం దొరకాలి.. అది ఇరు వర్గాలకు ఆమోదయోగ్యం కావాలి…

అదీ న్యాయ సమ్మతంగానే జరగాలి!

ఇదే లక్ష్యంగా నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసిన ‘ప్రీ లిటిగేషన్‌

కౌన్సెలింగ్‌ ఫోరం’ ముందుకు వినతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది!

వినతులు ఇలా…

స్థిరాస్తి సంబంధిత…భూ తగాదాలు: 101

నిర్వహణ: బుధవారం, శుక్రవారం

ఎక్కడ: స్వర్ణభారతి ఆడిటోరియం

ఇప్పటి వరకూ వచ్చిన ఫిర్యాదులు: 229

భవనం/అపార్టుమెంట్‌: 45

కారు పార్కింగ్‌: 5

పూర్తిగా పరిష్కారం: 5 (మిగిలిన వాటిలో ఇరువర్గాలు ఒప్పుకున్నవి వివిధ దశల్లో ఉన్నాయి)

చరాస్తి సంబంధిత..

నగదు లావాదేవీలు: 39

చీటీలు: అద్దె

వివాదాలు: 23

ఇతర వినతులు: 11

మల్కాపురం 1

మహారాణిపేట 2

గోపాలపట్నం 3

టూటౌన్‌ 5

నాల్గో పట్టణ 5

ఆరిలోవ 8

భీమిలి 8

హార్బర్‌ 8

దువ్వాడ 9

ఆనందపురం 10

ద్వారాక 10

వన్‌టౌన్‌ 11

ఎంవీపీ 15

గాజువాక 14

పి.ఎం.పాలెం 15

3వ పట్టణ 17

పెందుర్తి 17

న్యూపోర్టు 17

ఎయిర్‌పోర్టు 20

కంచరపాలెం 34

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *