హెచ్‌పీసీఎల్‌, జీవీఎంసీల మధ్య ఒప్పందం

విశాఖ ,సింధియా : హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, మహావిశాఖ నగరపాలక సంస్థల మధ్య ఒక కోటి ఆరు వేల రూపాయలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ఖరారైందని యాజమాన్య వర్గాలు తెలిపాయి. శనివారం జీవీఎంసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విశాఖ రిఫైనరీ ఇంఛార్జి జీఎం(హెచ్‌ఆర్‌) కె.నగేష్‌, జీవీఎంసీ కమిషనర్‌ సృజన ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. విశాఖ నగరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛత కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నట్టు జీవీఎంసీ వర్గాలు తెలిపాయి. అందుకు అవసరమైన 300 పుష్‌కార్ట్స్‌, 33 వేల డస్ట్‌బిన్నులు(10లీ), 10 బాటిల్స్‌ క్రషింగ్‌ మిషన్లు, 125 ట్రై బిన్నుల కొనుగోలుకు హెచ్‌పీసీఎల్‌ ఇచ్చే మొత్తం నిధులను వెచ్చించనున్నారు. రిఫైనరీ ఈడీ వి.రతన్‌రాజ్‌, జీవీఎంసీ ఏడీసీ సన్యాసిరావు, సీఎంవోహెచ్‌ డాక్టర్‌ శాస్త్రి, పీఆర్వో ఎం.కాళీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *