మంత్రి పేర్ని నానిపై దుండగుడి దాడి

కృష్ణాజిల్లా: రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నానికి తృటిలో ప్రమాదం తప్పింది. మచిలీపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం దుండగుడు మంత్రి కాళ్లకు దండం పెడుతూ పదునైన తాపీతో దాడికి తెగబడ్డాడు. అయితే వెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరులు దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 

ఈ ఘటనపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. ఈ రోజు అమ్మ పెద్దకర్మ ఉండటంతో పూజాధికాలు పూర్తి చేసుకొని కార్యక్రమానికి వచ్చిన ప్రజలను పలకరిస్తున్నాను. పెద్ద ఎత్తున అభిమానులు, బంధువులు ఇంటికి వచ్చారు. ఇదే క్రమంలో వారితో మాట్లాడుతూ భోజనాల దగ్గరకు వెళ్లాలని గేటు దగ్గరకు వెళ్లాను. ఆ సమయంలో ముందు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యక్తి కాళ్ల మీద పడుతున్నట్లుగా ఇనుప వస్తువుతో నా మీద దాడికి ప్రయత్నించాడు. అది బెల్ట్‌ బకెల్‌కి తగలడంతో నాకు ఎటువంటి ప్రమాదం కాలేదు. ఈ లోపు అప్రమత్తమైన గన్‌మెన్లు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నేను క్షేమంగానే ఉన్నాను.. ఏమీ జరగలేదు’ అని మంత్రి తెలిపారు.

దాడికి యత్నించిన ఆగంతకుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *