ఏసీబీ వలలో చోడవరం వ్యవసాయాధికారి, విస్తరణాధికారి.
రూ.19 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వైనం.
వివరాలను వెల్లడించిన ఏసీబీ డీజీ ఏబీ.వెంకటేశ్వరరావు.
శ్రీజైసూర్యన్యూస్: అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. విశాఖ జిల్లా చోడవరం మండలం వ్యవసాయశాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మండల వ్యవసాయాధికారి కర్రి ఉమా మహేశ్వరి, వ్యవసాయ విస్తరణాధికారి భగ్గు జనార్థనరావులు రూ. 19 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుపడ్డారు. ఈ మేరకు ఏసీబీ డీజీ ఏబీ.వెంకటేశ్వరరావు ఒక ప్రకటన విడుదల చేసారు. విశాఖ జిల్లా చోడవరం మండలానికి చెందిన పసుమర్తి ఆదినారాయణ అండ్ సన్స్ పేరిట ఉన్న ఎరువుల దుకాణానికి పురుగుల మందులు,ఎరువుల లైసెన్స్ రెన్యువల్ నిమిత్తం చోడవరం వ్యవసాయాధికారులు దుకాణ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పసుపర్తి సంతోష్ రాము వద్ద నుంచి లంచంగా రూ.19,000/- లు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెండ్ గా చిక్కినట్లు ఏసీబీ డీజీ తెలిపారు. లంచం తీసుకుంటూ పట్టుడిన వారిని అదే రోజు విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలించి విచారిస్తున్నట్లు ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.