- Local News, News

విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ కలకలం

శ్రీజైసూర్యన్యూస్:-విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీలో ఆంత్రాక్స్ కలకలం సృష్టించింది. కొయ్యూరు మండలం వెలగపాలెం కిత్తాబు గ్రామానికి చెందిన 5 ఏళ్ల గిరిజన బాలుడికి ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించాయి. బాలుడు ఒంటిపై బొబ్బలు, పొక్కులు రావడంతో స్థానికంగా నాటు వైద్యం చేయించారు. బాలుడికి పరిస్థితి విషమించడంతో హుటాహుటిన నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం కేజిహెచ్ తరలించాలని వైద్యుల సూచించారు. దీంతో బాలుడి బంధువులు భయపడి నర్సీపట్నం ఆసుపత్రి నుంచి బాలుడుతో సహా బంధువులు పరారయ్యారు. ఇదిలా ఉంటే.. కిత్తాబు గ్రామంలో బాలుడికి ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించడంతో ఆ గ్రామంలో వ్యాధి లక్షణాలపై వైద్య బృందం పరిశీలించనున్నది

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *