- Business, Entertainment, Local News, News

విశాఖ నోవాటెల్ హోటల్లో వస్త్ర ప్రదర్శన ఫ్యాషన్ షో

శ్రీజైసూర్యన్యూస్: విశాఖ స్టైల్‌ వీక్‌’ పేరిట ఈ నెల 28, 29 తేదీల్లో నగరంలోని నోవాటెల్‌ హోటల్‌లో వస్త్ర ప్రదర్శన, విక్రయాలు, ఫ్యాషన్‌ షో నిర్వహించనున్నారు. కళాంజలి సమర్పిస్తున్న ఈ కార్యక్రమాన్ని క్వీజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. విమెన్స్‌ ఫ్యాషన్‌ డిజైనర్స్‌ అసోసియేషన్‌, కళాంజలికి చెందిన 30 బొటిక్స్‌ల వస్త్రాల ప్రదర్శనతో పాటు, ముంబయి, దిల్లీ, విశాఖ నగరానికి చెందిన మోడళ్లతో సంప్రదాయ వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తారు. మిస్‌ ఇండియా-2018 ఏక్తామారు ప్రత్యేక ఆకర్షణగా పాల్గొంటారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవతం చేయాలని నిర్వాహకులు కోరారు. రెండో రోజు బొటిక్‌ డిజైనర్‌ షో విజేతకు డియో ద్విచక్రవాహనం బహుమతిగా ఇవ్వనున్నారు. మూన్‌పవర్‌ శ్రీనివాస్‌, డ్రీమ్స్‌ అష్రఫ్‌ ఆధ్వర్యంలో ఫ్యాషన్‌ షో ఉంటుంది.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *