- Local News, News, Political, Sports

ప్రజలు కష్టాలుపట్టని వైస్ జగన్ కు..రామ్ గోపాల్ వర్మకు మద్దతు తెలపడం విడ్డూరంగాఉంది:టీడీపీ నేత యామిని

విజయవాడ: తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులపై స్పందించిన జగన్.. రామ్ గోపాల్ వర్మకు మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేత యామిని సాధినేని అన్నారు. సైకో దర్శకునికి మద్దతు తెలుపుతూ జగన్ తన సైకోయిజం బయటపెట్టారని ఆమె ఎద్దేవా చేశారు. అమరావతిలో జగన్ కట్టుకున్న ఇంటికి టూ లెట్ బోర్డు పెట్టుకుంటే మంచిదని యామిని సూచించారు. మే 23 తర్వాత జగన్ శాశ్వతంగా ఏపీకి టూరిస్టుగా మారిపోతారని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని యామిని సాధినేని విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *