14,341 పోలీసు పోస్టులు ఖాళీ

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే పనిభారం ఎక్కువ

మహిళల ప్రాతినిధ్యం తక్కువే
‘డేటా ఆన్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్‌’ నివేదికలో వెల్లడి

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 14 వేల పైచిలుకు పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం మంగళవారం విడుదల చేసిన ‘డేటా ఆన్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్‌’ నివేదిక వెల్లడించింది. 2020 జనవరి 1నాటికి వివిధ రాష్ట్రాల్లో ఉన్న పోలీసు బలగాల స్థితిగతులను ఈ నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం రాష్ట్రానికి 73,894 పోలీసు పోస్టులు కేటాయించగా ప్రస్తుతం 59,553 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు తేలింది. ఇంకా 14,341 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం పోలీసుల్లో మహిళలు 5.85% మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న లెక్కలను బట్టిచూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల సంఖ్య తక్కువగా ఉంది. ప్రతి లక్ష మందిని 85 మంది పోలీసులు పర్యవేక్షించాల్సి వస్తోంది. ఈ అంశంలో అత్యధిక పనిభారం ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ప్రతి లక్ష మందికి అతితక్కువ పోలీసులున్న రాష్ట్రాల్లో 6వ స్థానంలో నిలుస్తోంది. ఉన్నతస్థానాల్లో ఖాళీలు తక్కువగా ఉన్నప్పటికీ కిందిస్థాయికి వెళ్లే కొద్దీ ఖాళీల సంఖ్య పెరుగుతూ పోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేసే మొత్తం పోలీసుల్లో ఎస్సీలు 10,913 మంది, ఎస్టీలు 4,187 మంది, ఓబీసీలు 31,408 మంది ఉన్నారు. మొత్తం పోలీసుల్లో వీరి సంఖ్య 46,508 మేర ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న మొత్తం సిబ్బందిలో వీరి నిష్పత్తి 78.09%. మహిళలు 3,483 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మొత్తం పోస్టుల్లో వీరికి 33% రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం 5.85% మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. ప్రతి మహిళా పోలీసు 7,516.22 మంది మహిళలను పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత తక్కువ నిష్పత్తి లేదు.

14,341 పోలీసు పోస్టులు ఖాళీ

14,341 పోలీసు పోస్టులు ఖాళీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *