టుడే హెడ్‌లైన్స్; ఆసక్తికర విశేషాలు

నిమ్మగడ్డ ‘కోడ్’ ముందే కూత
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ‘కోడ్’ పేరుతో సుదీర్ఘ కాలం అడ్డుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సుప్రీంకోర్టు తీర్పులకు సైతం వక్రభాష్యం చెబుతున్నారని రాజ్యాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వంతో దీర్ఘకాలిక ఘర్షణ దిశగా ఆయన సాగుతున్నారని పేర్కొంటున్నారు.
వినూ… ఇది మా మెనూ
మనలో ఒకరికి పిజ్జా ఇష్టం.. మరొకరికి సమోసా ఇష్టం.. ఇంకొకరికి బిరియానీ అంటే ప్రాణం.. ఒక్కొక్కరిదీ ఒక్కో టేస్ట్.. మరి జంతువుల టేస్ట్ ఏంటో మీకు తెలుసా? మన నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోనే బోలెడన్ని జంతువులు ఉంటాయి కదా.. వాటి ఇష్టాయిష్టాలు ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆలోచిద్దాం.. వాటి టేస్ట్లు ఏమిటో తెలుసుకుందాం? రోజూ ఏం తింటున్నాయో చూసి వద్దాం.. సో చలో జూ…
కోవాగ్జిన్‌కు ఎదురుదెబ్బ.. వలంటీర్ మృతి
హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కోవాగ్జిన్’ తీసుకున్న 42 ఏళ్ల వలంటీర్ మృతి చెందాడు. భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. భోపాల్‌లోని పీపుల్స్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డిసెంబర్ 12న కోవాగ్జిన్ హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా గిరిజన కూలి అయిన దీపక్ మర్వాయి అనే వ్యక్తికి(వలంటీర్) సైతం వ్యాక్సిన్ ఇచ్చారు.
ట్విట్టర్ నుంచి ట్రంప్ అవుట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టుగా సామాజిక మాధ్యమం ట్విట్టర్ ప్రకటించింది. ఒక దేశాధినేత అకౌంట్‌ని శాశ్వతంగా తొలగించడం ఇదే తొలిసారి. అమెరికా క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడికి దిగిన రెండు రోజుల తర్వాత ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా ట్రంప్ పెట్టే పోస్టులు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్ తెలిపింది.
మూడుముక్కలాట.. విజయం ఎవరిదో
ఒకవైపు వరుస ఎదురుదెబ్బలు తగిలిన అధికార టీఆర్ఎస్. పైగా వారికది సిట్టింగ్ స్థానం. మరోవైపు కాంగ్రెస్ అత్యంత సీనియర్ నేతకు రాజకీయంగా జీవన్మరణ సమస్య. దుబ్బాక, జీహెచ్ఎంసీ విజయాలు గాలివాటం కాదని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే క్రమంలో ఉన్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యత బీజేపీది. ఇలా అందరికీ ప్రతిష్టాత్మకంగా మారిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రభుత్వాసుపత్రిలో ఘోరం
మహారాష్ట్రలోని భందారా ప్రభుత్వాసుపత్రిలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ప్రత్యేక న్యూబార్న్ కేర్ యూనిట్(ఎస్ఎన్సీయూ)లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ఆ యూనిట్లో మొత్తం 17 మంది నవజాత శిశువులు ఉండగా, వారిలో ఏడుగురిని రక్షించినట్టు వైద్యులు తెలిపారు. మరణించిన వారంతా ఒకటి నుంచి మూడు నెలలోపు పసిబిడ్డలే కావడం విషాదం.
స్త్రీల కోసం సాగిన సుమధుర గీతం
‘దారి చూపిన దేవత… నీ చేయి ఎన్నడు వీడతా’….స్త్రీల సెంటిమెంట్‌ను మాట్లాడాల్సి వస్తే సగటు స్త్రీని శ్లాఘించాల్సి వస్తే సినిమాకు ఏసుదాస్ గొంతు కావాలి. ఏసుదాస్ వారిని పొగిడినా వారి వేదనను పాడినా ఎంతో స్థిమితం. సమాజం నిర్దేశించిన సాధారణ చట్రంలో ఉండే స్త్రీలు ఏసుదాస్ పాటతో ఊరడిల్లి కలెక్షన్లకు కారణమయ్యేవారు.
బ్రిస్బేన్‌లో టెస్టు ఆడతాం: బీసీసీఐ
భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు వేదిక విషయంలో సందిగ్ధత వీడింది. బ్రిస్బేన్‌లో ఈ మ్యాచ్ ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు బీసీసీఐ సమాచారం అందించింది. అయితే మ్యాచ్ ముగిశాక ఒక్క రోజు కూడా తాము అక్కడ ఉండబోమని, వెంటనే భారత్‌కు వెళ్లిపోయే ఏర్పాట్లు చేయాలని కోరింది. ‘చివరి టెస్టు ముగిసిన వెంటనే భారత్‌కు తిరిగి వెళ్లే ఏర్పాట్లు చేయమని వారిని కోరాం. అందుబాటులో ఉన్న మొదటి ఫ్లయిట్లోనే పంపిస్తే మంచిది.
లాయర్ వనిత: అగ్రరాజ్య అటార్నీ
అమెరికాలో ఈ ఏడాది జనవరి 20 భారతీయులకు పెద్దపండగ. అక్కడ ఉన్న ఎన్నారైలకే కాదు, ఇక్కడున్న మనక్కూడా. ఆ రోజు జో బైడెన్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు అమెరికా చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ బాధ్యతలు చేపడతారు. కమల భారత సంతతి మహిళ కనుక అది మనకు గర్వకారణం. అయితే ఈ గర్వకారణం ఇప్పుడు కమల ఒక్కరి వల్లే కాదు, వనితాగుప్త వల్ల కూడా.
2021: మీ కోసం బాలీవుడ్ ఫ్రెష్ మెనూ
కపిల్‌దేవ్‌గా రణవీర్ సింగ్ వేడి వేడి షాట్స్ సర్వ్ చేస్తాడు. లాల్‌సింగ్ చద్దాగా ఆమిర్ ఖాన్ పొగలు గక్కే సబ్జీ రెడీ చేస్తాడు. మైదాన్‌లో అజయ్ దేవ్‌గణ్ కొట్టే గోల్స్‌ను చూస్తే కడుపు నిండిపోవాల్సిందే. 2020 కరోనాతో ప్రేక్షకుల కడుపు మాడ్చింది. 2021 మీ కోసం బాలీవుడ్ ఫ్రెష్ మెనూను తెస్తోంది. దాదాపు ఇరవై ముప్ఫై మంచి సినిమాలు ఈ సంవత్సరం రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రేక్షకులు కూడా. కరోనా వార్తలు ఎలా ఉన్నా రెడీ అవండి. ఏమో.. అంతా బాగైపోవచ్చేమో. వీటి రిలీజుకు మనం థియేటర్లో కలవొచ్చేమో. చూద్దాం.