రేపు స్థానిక ఎన్నికలపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్

అమరావతి: స్థానిక ఎన్నికల షెడ్యూల్ నిలుపుదల చేయాలంటూ సోమవారం హైకోర్టు వెకేషన్ బెంచ్‌లో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనుంది. నిన్న హౌస్ మోషన్ పిటిషన్‌కు ప్రభుత్వం ప్రయత్నించింది. అత్యవసర విచారణ కంటే రేపు జరిగే వెకేషన్ బెంచ్‌లో విచారిస్తామని కోర్టు తెలిపింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలు, బదిలీలపై నిషేధం విధించడంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎన్నికల విషయంలో ముందుకెళ్లకుండా ఎస్ఈసీని నిలువరించాలని పిటిషన్లో కోరింది. ఎన్నికల నిర్వహణకి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ని రద్దు చేయాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని ప్రభుత్వం అభ్యర్థించింది.