బుడతల బుర్రలకు పదును

రాష్ట్రస్థాయి సైన్సు ప్రతిభాన్వేషణ పోటీలకు ఆహ్వానం

విశాఖపట్నం : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ‘కౌశల్‌’ రాష్ట్రస్థాయి ప్రతిభాన్వేషణ పోటీలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి (ఆప్‌కాస్ట్‌), భారతీయ విజ్ఞాన మండలి (బీవీఎం) సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో సైన్స్‌ క్విజ్‌, పోస్టర్‌ ప్రజంటేషన్‌ పోటీలకు ఆన్‌లైన్‌లో ఆహ్వానం పలుకుతోంది.
కౌశల్‌ సైన్స్‌ క్విజ్‌ పోటీ : క్విజ్‌ బృందం ఎంపిక కోసం 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం ప్రతి పాఠశాల నుంచి తరగతికి 10 మందిని అనుమతిస్తారు. పాఠశాల స్థాయిలో మొదటిస్థానం పొందిన విద్యార్థులను ఒక బృందంగా ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి పోటీలకు గరిష్ఠంగా 36 బృందాలను ఎంపిక చేస్తారు. కేవలం ప్రభుత్వ రంగ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. గెలుపొందిన విజేతలకు నగదుతో పాటు ధ్రువపత్రాలు, జ్ఞాపికలు అందజేస్తారు.
సిలబస్‌: 7, 8, 9 తరగతుల గణితం, సైన్సు, విజ్ఞాన భారతి వారి ‘విజ్ఞానశాస్త్ర రంగంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి’

విద్యార్థులకు ఇచ్చే అంశాలు..
* విజ్ఞానశాస్త్ర రంగంలో భారతీయుల కృషి
* జల సంరక్షణ
* జీవ వైవిధ్య పరిరక్షణ
* వాతావరణ మార్పులు
* ప్రకృతి వ్యవసాయం
* సంప్రదాయ ఆరోగ్య సంరక్షణ పద్ధతులు

పోస్టర్‌ ప్రజంటేషన్‌లు‌ పోటీలు : ప్రతి పాఠశాల నుంచి 8, 9 తరగతులకు చెందిన ఇద్దరు విద్యార్థులు రెండు ప్రజంటేషన్‌లు‌ ఇవ్వాలి. ఎంచుకున్న థీమ్‌పై పోస్టర్‌ రూపొందించి దానిని వివరిస్తూ 2 నిమిషాలు మించకుండా వీడియో తీసి ఆ వీడియోను అప్‌లోడ్‌ చేయాలి. వాటిలో ఉత్తమమైన 12 పోస్టర్లను జిల్లాస్థాయి పోటీలకు తీసుకుంటారు. వారందరికీ నగదు బహుమతితో పాటు జ్ఞాపిక, ధ్రువపత్రాలను అందజేస్తారు.
పేర్లు నమోదు ఇలా.. : ఈనెల 31వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలి. ఫిబ్రవరి 9న ప్రాథమిక స్థాయి పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. జిల్లాస్థాయి పోటీలను ఫిబ్రవరి 16న, రాష్ట్రస్థాయిలో ఫిబ్రవరి 27న ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. విద్యార్థులు www.bvmap.org వెబ్‌సైట్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని విశాఖ జిల్లా కౌశల్‌ సమన్వయకర్త ఎం.శ్రీనివాస్‌ పట్నాయక్‌ తెలిపారు. మరిన్ని వివరాలకు 83416 95333, 94410 50024, 94934 75689, 99639 22087 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *