ఖాళీగా విశాఖ సాగరతీరం రోడ్లు

విశాఖ: సంక్రాంతి సందర్భంగా విశాఖ నగరంలో ఉన్నవారు చాలా మంది పల్లెలకు తరలి వెళ్లడంతో పట్టణంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నిత్యం కలకలలాడే విశాఖ సాగర తీరం రోడ్లన్నీ ఒక్కసారిగా బోసిపోయాయి. మరోవైపు దొంగతనాలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. చాలా చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 40 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి వీథుల్లో నిఘా పెంచారు.