Jaisurya News

సుప్రీం కోర్టులో ఏపీ పంచాయితీ ఎన్నికల కేసు విచారణ ప్రారంభం

ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏపీ పంచాయితీ ఎన్నికల కేసు విచారణ ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఎన్నికలపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పిటిషన్‌కు ముందే ఎస్ఈసీ కేవియట్‌ దాఖలు చేసింది. విచారణలో తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే, స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ గోవా ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య తెర పైకి తెచ్చింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నందున్న స్థానిక ఎన్నికలను ఏప్రిల్ నాటికి గోవా ఎస్ఈసీ వాయిదా వేసింది. గోవా ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *