Jaisurya News

సుప్రీం తీర్పుపై ఎంపీ రఘురామ రాజు ఏమన్నారంటే..

 

ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వైఎస్ఆర్‌సీపీ ఎంపీ రఘు రామ కృష్ణ రాజు స్వాగతించారు. ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేసిన ఆయన.. రాజ్యాంగం గెలిచిందని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు ఆదేశాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చి చెప్పింది. వ్యాక్సినేషన్‌ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని పేర్కొంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *