విశాఖ: సుప్రీంకోర్టు తీర్పుపై కనీసం గౌరవం ఉంటే ఇప్పుడైన వైసీపీ ప్రభుత్వం , అధికారులు ఎన్నికలకు సహకారం అందించాలని విశాఖ తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలపై ఐదు కోట్ల ఆంధ్రులు పెట్టుకున్న ఆశలను న్యాయవ్యవస్థ నెరవేర్చిందన్నారు. ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తూన్న రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం తీర్పు చెంప పెట్టు అని వెలగపూడి రామకృష్ణ బాబు తెలిపారు.