Jaisurya News

గవర్నర్‌ను కలవనున్న టీడీపీ బృందం

అమరావతి: సోమవారం సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ విశ్వభూషన్ హరిచందన్‌ను టీడీపీ బృందం కలవనుంది. గవర్నర్‌ను టీడీపీ నేతలు వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్‌రావు, బుద్దా వెంకన్న, మంతెన సత్యనారాయణరాజు, వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కలవనున్నారు. ఈ రోజు సాయంత్రం గవర్నర్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కలవనున్నారు. పంచాయతీ ఎన్నికల పరిణామాలపై  నిమ్మగడ్డ వివరించనున్నారు. ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చి చెప్పింది. వ్యాక్సినేషన్‌ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని పేర్కొంది. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయంలో జోక్యం చేసుకోమని న్యాయస్థానం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *