Jaisurya News

ఆ వార్డుల్లో మళ్లీ నామినేషన్ల ప్రక్రియ

విశాఖ : నామినేషన్‌ వేసిన తరువాత మరణించిన అభ్యర్థుల వార్డుల్లో మరోసారి నామపత్రాల దాఖలుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించింది. మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 19వ వార్డు అభ్యర్థిని వలిశెట్టి సత్య (కాంగ్రెస్‌), 77వ వార్డుకు చెందిన ముక్తర్‌ అలి (ఇండిపెండెంట్‌, తెదేపా), అదే వార్డులో బట్టు సన్యాసిరావు (వైకాపా), 79వ వార్డులో అల్లూరి రామకృష్ణరాజు (వైకాపా) మృతి చెందారు. ఆయా వార్డుల్లో ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్లు దాఖలు చేయవచ్చని ఎస్‌ఈసీ తెలిపింది. ఉపసంహరణ, మిగతా ప్రక్రియ యథాతథంగా ఉంటుందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *