57 మంది మద్దతుంటేనే.. మేయర్ పీఠం

తెదేపా 6..వైకాపా 7: ఇద్దరు ఎమ్మెల్సీలు, నలుగురు ఎమ్మెల్యేలతో కలిపి ఆరుగురి బలం తెదేపాకు ఉంది. వీరిలో వాసుపల్లి పార్టీ మారినందున ఐదుగురి బలమే ఉన్నట్లవుతుంది. అలాగని మేయర్ ఎన్నికలో వైకాపాకు అనుకూలంగా వాసుపల్లి వ్యవహరిస్తే ఎమ్మెల్యే పదవికి సాంకేతికంగా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది.
● వైకాపాకు ముగ్గురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు వెరసి ఏడుగురి బలం ఉంది. భాజపాకు ఒకరు ఉన్నారు. జీవీఎంసీలో వార్డు స్థానాలకు హోరాహోరీ పోరు సాగి రెండు పార్టీలకు చెరి సమానంగా సీట్లు లభిస్తే ఎక్స్ అఫిషియో సభ్యులు కీలకంగా మారనున్నారు. మేయరు, ఉప మేయరు ఎంపికలో వీరికి ఓటు వేసే అవకాశం ఉంది. ఆ రకంగా నగర పరిధిలో తెదేపాకు, నగరాన్ని ఆనుకొని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వైకాపాకు బలం ఉంది. దీంతో రాజకీయ పక్షాలు లెక్కలు వేసుకుంటూ గెలుపు అవకాశాలను పదిలం చేసుకొనే ప్రయత్నాలు ప్రారంభించాయి.