Jaisurya News

ఏపీలో మరో 2 రోజులు వర్షాలు!

అమరావతి: తమిళనాడు నుంచి ఉత్తరకోస్తా వరకు తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి విస్తరించింది. ఇంకా ఈశాన్య భారతం నుంచి మధ్య భారతం, తెలంగాణ, కర్నాటక మీదుగా అరేబియా సముద్రం వరకు మరో ద్రోణి ఆవరించి ఉంది. ఈ రెండింటి ప్రభావంతోపాటు సముద్రం నుంచి తేమగాలులు వీస్తుండడంతో కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల దట్టంగా మేఘాలు ఆవరించాయి. పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురిశాయి. సోమ, మంగళవారాల్లోనూ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *