Jaisurya News

అప్పన్న సన్నిధిలో ఏపీఐఐసీ ఛైర్మన్‌

కప్పస్తంభం వద్ద పూజలు చేస్తున్న ఏపీఐఐసీ ఛైర్మన్‌ రోజా, తదితరులు

సింహాచలం : ఏపీఐఐసీ ఛైర్మన్‌ ఆర్‌కే రోజా ఆదివారం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అంతరాలయ పూజల్లో పాల్గొన్నారు. పండితులు ఆమెను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ట్రస్టుబోర్డు సభ్యులు స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి రెండోసారి వస్తోందని భయబ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలో రాష్ట్రంతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా ఆరోగ్యంగా ఉండాలని స్వామిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *