Jaisurya News

విశాఖ కలెక్టరేట్‌ ఎదుట 700 మంది ఆందోళన

విశాఖ: పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ విశాఖ జిల్లా ఆనందపురం మండలం గండిగుండం సర్పంచ్ అభ్యర్థి రమేశ్‌ ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టరేట్‌ ఎదుట 700 మంది మద్దతుదారులతో నిరసన చేపట్టారు. విశాఖపట్నం రెవెన్యూ డివిజన్‌లోని 130 గ్రామపంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. అయితే గండిగండం పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఓ వర్గం అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తొలుత  రమేశ్‌ విజయం సాధించారని ప్రకటించి, మళ్లీ రీకౌంటింగ్‌ నిర్వహించారని, అనంతరం ప్రత్యర్థి విజయం సాధించినట్లు ధ్రువీకరించారని చెబుతున్నారు. కలెక్టర్‌ చొరవ తీసుకొని మళ్లీ పోలింగ్‌ నిర్వహించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

విశాఖ కలెక్టరేట్‌ ఎదుట 700 మంది ఆందోళన

విశాఖ కలెక్టరేట్‌ ఎదుట 700 మంది ఆందోళన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *