AP: మహిళా, శిశు సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్

అమరావతి: రాష్ట్ర బడ్జెట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ను జెండర్ బేస్డ్ బడ్జెట్‌గా తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా, శిశు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక బడ్జెట్ రూపొందించనున్నట్లు పేర్కొంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం ప్రత్యేక బడ్జెట్ తయారీకి నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మహిళలు, బాలికలకు వెచ్చించే నిధులు ప్రత్యేక బడ్జెట్ ద్వారా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. మహిళా-శిశు బడ్జెట్ అమలుకు నోడల్ విభాగంగా మహిళా శిశు సంక్షేమశాఖ ఉంటుందని పేర్కొంది.