- Local News, News, Political

సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి ఆశా వర్కర్ల పిలుపు

విజయవాడ: ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి ఆశా వర్కర్లు, బ్రాందీ షాపు కార్మికులు పిలుపు ఇవ్వడంతో తాడేపల్లిలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జగన్ నివాసానికి వెళ్లే మార్గంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ సోమవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఎక్సైజు నూతన పాలసీకి సంబంధించి బ్రాందీ షాపులు ఇకపై ప్రభుత్వమే నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో బ్రాందీ షాపులకు కోత విధించి, అందులో పనిచేసేవారికి, విద్యార్హత నిబంధన తేవడంతో వారంతా ఆందోళన బాట చేయడానికి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా వారది వద్ద వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
అదే సమయంలో ఆశా వర్కర్లు కూడా తమ సమస్యలపై నిరసన తెలియజేయడానికి వస్తున్న నేపథ్యంలో వారిని విజయవాడ ధర్నా చౌక్‌కు వెళ్లే విధంగా పోలీసులు చర్యలు చేపట్టారు. జగన్ తన పాదయాత్ర సందర్భంగా తమకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి స్థాయిలో నెరవేర్చాలని వారు ఆందోళనబాట పట్టారు. వందలాదిగా ఆశా వర్కర్లు ధర్నా చౌక్‌కు చేరుకుంటున్నారు…

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *