- Local News, News, Political

కక్ష సాధింపే తప్ప… సంక్షేమం పట్టడం లేదు…ఎంపీ రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం: వైసీపీ ప్రభుత్వ అవగాహనారాహిత్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదర్భంగా కలెక్టరేట్‌కు వచ్చిన ఎంపీ రామ్మోహన్.. జాయింట్ కలెక్టర్‌కు జిల్లా సమస్యలను వివరించారు. అనంతరం మాట్లాడిన రామ్మోహన్.. రైతులకు సకాలంలో నీరు అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రైతుల సమస్యలపై సమీక్ష చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. సీఎం జగన్‌కు కక్ష సాధింపు తప్ప.. ప్రజల సంక్షేమమే పట్టడంలేదన్నారు. అవగాహన లేని వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుందో మూడు నెలలకే అర్థం అయిపోయిందని వ్యాఖ్యానించారు. సంక్షేమ రంగంలో చంద్రబాబు రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని చెప్పుకొచ్చారు. కానీ, వైసీపీ ప్రభుత్వం మాత్రం మూడు నెలల్లోనే రాష్ట్రాన్ని దివాళా తీయించిందన్నారు….

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *