- Local News, News, Political

అవినీతి వెతికినా దొరకదు… చంద్రబాబు

అమరావతి: రాజధాని భూముల అంశంపై పోరాటం ఉధృతం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తామన్నారు. టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీలన్నింటినీ ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు త్వరలో కమిటీని నియమిస్తామన్నారు. హైదరాబాద్ గ్రౌండ్ ఫీల్డ్ అయితే అమరావతి గ్రీన్ ఫీల్డ్ అవుతుందని పేర్కొన్నారు. రాజధానికి స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చారని చెప్పారు. అందులో అవినీతి వెతికినా దొరకదని స్పష్టం చేశారు. అవినీతి అంటూ ప్రభుత్వం అభివృద్ధిని కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ 100 రోజుల పాలన, వైఫల్యాలపై పుస్తకం విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పారు. త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని తెలిపారు. పెండింగ్ బిల్లుల నిలిపివేతపై గవర్నర్‌ను కలుస్తామన్నారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *