- Local News, News

మట్టి గణపతిని పూజించాలి… జీవీఎంసీ కమిషనర్ సృజన పిలుపు

విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఆవరణలో మట్టిగణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీవీఎంసీ కమిషనర్ సృజన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమంలో కొన్ని స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మట్టి విగ్రహాలనే పూజించాలని సృజన పిలుపు ఇచ్చారు. పర్యావరణానికి హాని చేసే.. కెమికల్స్‌తో తయారుచేసే వినాయక ప్రతిమలను వినియోగించవద్దని, పర్యావరణ హితమైన మట్టి గణపతినే అందరూ ఉపయోంచాలని ఆమె సూచించారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *