- Local News, News, Political

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు”ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి

ఏపీ: గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్ణయించిన ఏదో ఒక ఫొటో గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలి.
ఒకవేళ హాల్‌ టిక్కెట్‌పై ముద్రించిన ఫోటో స్పష్టంగా కనిపించకపోతే అలాంటి అభ్యర్థులు గజిటెడ్‌ అధికారి నిర్ధారించిన మూడు కలర్‌ ఫోటోలను తెచ్చుకోవాలి.
అభ్యర్థులు నలుపు/ నీలి రంగు బాల్‌ పాయింట్‌ పెన్నులను మాత్రమే ఓఎంఆర్‌ షీట్‌పై బబ్లింగ్‌ చేసేందుకు ఉపయోగించాలి.
ఉదయం జరిగే పరీక్షకు 8.30 గంటలకు, మఽధ్యాహ్నం పరీక్షకు 2 గంటల నుంచి లోపలికి అనుమతిస్తారు.
అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 10 తర్వాత, మధ్యాహ్నం 2.30 తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.
అభ్యర్థులు తమ ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ వస్తువులను పరీక్ష కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సామాన్లు భద్రపర్చే గదిలో డిపాజిట్‌ చేయాలి.
పరీక్ష ముగిసిన తర్వాత వారితో పాటు ప్రశ్నాపత్రం, ఓఎంఆర్‌ నకలు (కార్బన్‌ కాపీ)ని తీసుకెళ్లవచ్చు.
అభ్యర్థులు ఒరిజినల్‌ ఓఎంఆర్‌ షీట్స్‌ని బయటకు తీసుకెళ్లరాదు.
ఒక వేళ అభ్యర్థులు ఒరిజినల్‌ ఓఎంఆర్‌ షీట్‌ని బయటకు తీసుకెళ్లినట్లు అయితే వారిపై క్రిమినల్‌ చర్యలు చేపడతారు.
అభ్యర్థులు పరీక్ష ముగిసేవరకు హాల్‌లోనే ఉండాలి. ఒకవేళ మధ్యలో వెళితే వారి జవాబు పత్రాన్ని పరిగణనలోకి తీసుకోరు.
అభ్యర్థులు వారి మార్కుల ఆధారంగా సంబంధిత ఉద్యోగానికి ఎంపిక అవుతారు. దళారులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *